జైశ్రీరామ్.
శ్లో. ఉత్తమః క్లేశవిక్షోభం - క్షమః సోఢుం న హీతరః।
మణిరేవ మహాశాణ - ఘర్షణం న తు మృత్కణః॥
తే.గీ. క్లేశవిక్షోభమోర్చుసచ్ఛీలుడిలను,
బాధలన్యులోర్వగలేరు, భాసురమగు
మణియె రాపిడినోర్చును,మట్టిబెడ్డ
యోర్వలేనటుల్,సుజనుల కోర్పధికము.
భావము. కష్టాలవల్ల కలిగే క్షోభను ఉత్తముడు మాత్రమే తట్టుకోగలడు.
సాన మీద ఒరిపిడిని మాణిక్యమే సహించగలదు కానీ మట్టిపెడ్డ సహించగలదా.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.