గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఆగస్టు 2023, మంగళవారం

షడ్భిరూర్మిభిరయోగి యోగిహృద్ ..... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  షడ్భిరూర్మిభిరయోగి యోగిహృద్

భావితం న కరణైర్విభావితమ్ |

బుద్ధ్యవేద్యమనవద్యమస్తి యద్

బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని ॥(వివేకచూడామణి 256వ శ్లోకము)

తే.గీ.  ఘనషడంగములంటని, యనవరతము

యోగిధ్యానించునట్టిది,నింద్రియమ్ము

లెఱుఁగఁ జాలని,బుద్ధియునెఱుఁగలేని,

బ్రహ్మమీవేను, ధ్యానించు బ్రహ్మనరసి.

భావము.  క్షుద, తృష్ణ, శోకము, మోహము, జననము, మరణము 

యీ 6న్ను షడూర్ము లనంబడును. ఈ తరంగములచే తాకబడనిది; 

యోగి హృదయం ద్వారా ధ్యానించబడినది, కానీ ఇంద్రియ 

అవయవాలచే గ్రహించబడలేదు; బుద్ధి తెలుసుకోలేనిది; 

మరియు అపరిష్కృతమైనది అయిన ఆ బ్రాహ్మవు నీవు, 

నీ మనస్సులో దీనిని ధ్యానించు.

జైహింద్..

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.