జై శ్రీరామ్.
శ్లో. సంరోహత్యగ్నినా దగ్ధం - వనం పరశునా హతం౹
వాచా దురుక్తం బీభత్సం - న సంరోహతి వాక్ క్షతం౹౹
తే.గీ. భూజమును కాల్చ, నరికినన్, మ్రోడు మరల
చిగురు పెట్టును, చెడుపల్కు చిత్తమునకు
హత్తుకొనినచో విరుగు, తా నతుకుకొనదు,
మాటలన్ గొల్పుమానందమార్గమిలను.
భావము. అగ్నిచే దహింపబడిన , లేదా గొడ్డలిచే నరకబడిన అడవి కొంతకాలానికి
క్రమంగా మళ్ళీ చిగురిస్తుంది. కానీ? కఠినమైన, అనుచితమైన మాటలచే
దెబ్బతిన్న మనస్సు కుదుటపడదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.