గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఆగస్టు 2023, శుక్రవారం

పణ్దితైస్సహ సాఙ్గత్యం...... మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  పణ్దితైస్సహ సాఙ్గత్యం  -  పణ్దితైస్సహ సంకథాః।

పణ్దితైస్సహ మిత్రత్వం  -  కుర్వాణో నావసీదతి॥

తే.గీ.  పండితులతోడ సాంగత్య ఫలితమొకటి,

పండితులతోడ భాషణ ఫలమదొకటి,

పండితులతోడ సన్మైత్రి ఫలమదొకటి

కలిగినన్ నాశమన్నది కలుఁగఁబోదు.

భావము. పండితులతో సహవాసం,పండితులతో ....మాటలాడుట, 

పండితులతో మైత్రి - వీటిని ఆచరించువాడు నాశమునొందడు.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.