జైశ్రీరామ్.
శ్లో. వలిభిర్ముఖమాక్రాంతం - పలితేనాంకితం శిరః ।
గాత్రాణి శిథిలాయంతే - తృష్ణైకా తరుణాయతే ॥
కం. కలుగును ముఖమున ముడతలు
తెలతెల్లని జుత్తు శిరము తేజము బాపున్,
కల దేహము శిధిలమగును,
కలిగెడి కోర్కెలు తరుణముగా నుండునహో.
భావము. ముఖమున ముడుతలు వచ్చును. జుత్తు నెరిసిపోవును. శరీరను
శిధిలావస్థకు చేరును. ఐనప్పటికీ కోరికలు మాత్రము
నిత్య నూతనముగా కలుగుచునే యుండును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.