గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఆగస్టు 2023, గురువారం

గురుందృష్ట్వా సముత్తిష్టే..... మేలిమి బంగారంమన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో. గురుందృష్ట్వా సముత్తిష్టే దభివాద్య కృతాంజలిః|

నైతైరుపవిశేత్ సార్ధం వివదేన్నాత్మకారణాత్||

శ్లో.  జీవితార్థమపిద్వేషాత్ గురభిర్నైవ భాషణమ్|

ఉదితోపి గుణై రన్యై ర్గురుద్వేషీ పతత్యథః॥

(శ్రీ కూర్మ పురాణం శ్లో॥29-30, అధ్యా-12, ఉ, )  

చం.  గురువును చూచినంతటనె కూరిమితో నెదురేగి వందనం

బురవుగఁ జేసి వేరుగను నొప్పుగకూర్చొనియుండి, వారి వి

స్తరమగు బోధనల్ వినుచు దానికి మారు వచింపకుండ, నే

తెరగునఁ గోప మొందకను, ద్వేషము చూపక నుండగా వలెన్.

భావము.  గురువు కనపడిన వెంటనే కూర్చున్న ఆసనం నుంచి లేచి 

రెండు చేతులూ జోడించి విధిగా నమస్కరించాలి. 

గురువుతో కలిసి ఒకే ఆసనం మీద ఎప్పుడూ కూర్చోకూడదు. 

తనకోసం గానీ, బ్రతుకుతెరువు కోసం గానీ గురువుతో ఎప్పుడూ 

వాదన చేయకూడదు. గురువుతో  ఆగ్రహంగా, ద్వేషపూరితంగా 

ప్రసంగించకూడదు. గురువు దగ్గర అవగుణాలున్నప్పటికీ 

గురువుని ద్వేషించకూడదు. అలా ద్వేషించిన వాడు పతితుడవుతాడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.