గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, ఆగస్టు 2023, బుధవారం

దేవద్విజగురుప్రాజ్ఞ ..... మేలిమి బంగారం మన్బ సంస్కృతి

జైశ్రీరామ్.

శ్లో|| దేవద్విజగురుప్రాజ్ఞ  -  పూజనం శౌచమార్జనమ్ |

బ్రహ్మచర్యమహింసా చ  -  శారీరకం తప ఉచ్యతే || 

తే.గీ.  ప్రాజ్ఞ, దేవ ద్విజుల, గురువరుల పూజ,

దేహశౌచ మహింసయు, దివ్యమైన

బ్రహ్మచర్యమున్ దపములు, వరలఁ జేయ

దగినవి భువి దేహముచేతఁ దలచి చూడ.

భావము. 

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించుట, శరీరశుద్ధి కలిగియుండుట 

మరియు ఋజుత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శరీరముచే చేయదగిన తపస్సులని 

చెప్పబడుచున్నవి.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.