గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2023, సోమవారం

పద్య భారతిలో నేటి న్యస్తాక్షరి. 1--1 రా; 2—5 య; 3—10 మా; 4—12 త. నిర్దేశితాక్షరములు ఆయా స్ధానములలో వచ్చునట్లు ఉత్పల మాలలో రామాయణపరంగా.. కంద గీత గర్భ ఉత్పలమాలలో నా పూరణ.

 జైశ్రీరామ్.

కంద గీత గర్భ ఉత్పలమాల.

రామహితార్థదా! ప్రవర! రా మహనీయుఁడ!రమ్య తేజమా

రామ సుధీయనన్ గనగ క్రన్నన వచ్చి సుఖంబు గొల్పుదే.

మా మహితాత్ముఁడా! సుకరమా సహజీవన శోభ గూర్చ సౌ

మ్యా!మననీయుమా వసుధ మాన్యత గొల్పఁగ వచ్చి చూడుమా. 

ఉత్పలమాల గర్భస్థ కందపద్యము.

మహితార్థదా! ప్రవర! రా 

మహనీయుఁడ!రమ్య తేజమారామ సుధీ

మహితాత్ముఁడా! సుకరమా 

సహజీవన శోభ గూర్చ సౌమ్యా!మననీ

ఉత్పలమాల గర్భస్థ తేటగీతి.

ప్రవర! రా మహనీయుఁడ!రమ్య తేజ

గనగ క్రన్నన వచ్చి సుఖంబు గొల్పు

సుకరమా సహజీవన శోభ గూర్చ

వసుధ మాన్యత గొల్పఁగ వచ్చి చూడు.

సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.