గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2023, గురువారం

అగ్నిహోత్రఫలా వేదాః ..... మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్. 

శ్లో|| అగ్నిహోత్రఫలా వేదాః శీలవృత్తఫలం శ్రుతమ్l

రతిపుత్రఫలా నారీ దత్తభుక్తఫలం ధనమ్ll

తే.గీ.  వేద ఫల మగ్ని కొసగుటే ప్రీతితోడ,

శాస్త్ర ఫలము సద్వర్తనే సన్నుతముగ,

పత్నిఁ గూడుట సత్పుత్ర ఫలము కొఱకె,

ధనము దాన భోగములకే ధరణి నరయ.

భావము.   "వేదాధ్యయనానికి ఫలం అగ్నిహోత్రాన్ని అర్పించడమే. శాస్త్రానికి ఫలం సత్ప్రవర్తన. 

స్త్రీ సంగమానికి ఫలం సుఖసంతానం కలగడమే. ధనానికి ఫలం దానం చేయడం,

అనుభవించడమూను!
జైహింద్.    



Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.