గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, ఆగస్టు 2023, శుక్రవారం

సుగంధేనవినాపుష్పం....మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

 శ్లో. సుగంధేనవినాపుష్పం   -  కుత్రాపి నచశోభతే

 సదాచారైర్వినా కోపి  -  పూజ్యతాం నాధిగచ్ఛతి.

తే.గీ.  పరిమళము లేని పుష్పంబు  నిరుపయోగ

మరయగా నట్టులే భువి నిరుపమాన

మౌ సదాచార విరహిత మయిన జన్మ

గౌరవముపొంద నేరదు, స్మార జనక!

భావము.  పువ్వు ఎన్నెన్నిరంగులతో అందంగానున్ననూ ,

సువాసనలేనిచో శోభింపదు. అట్లే మంచిఅలవాట్లులేనిచో ,

మానవుడూ గౌరవాన్ని పొందలేడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.