గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఆగస్టు 2023, బుధవారం

కాలః పచతి భూతాని,...ంఏలిమిబంగారం మన సంస్కృతి

 జైశ్రీరామ్.🙏🏻

శ్లో. కాలః పచతి భూతాని,

కాలః సంహారతే ప్రజాః!

కాలః సుప్తేషు జాగర్తి,

కాలో హి దురతిక్రమః!!

కం. కాలము ప్రాణుల మ్రింగును 

కాలమె జనులను నశింపగా చేయుచు నా

కాలము మాత్రము నిలుచును,

కాలంబునతిక్రమింపగాలేముకదా.

భావము.

 కాలము ప్రాణులను మ్రింగుచున్నది. కాలమే ప్రజలను నశింపజేయును. 

సమస్త పదార్థములు నశించినను కాలము నిలిచియుండును. 

నిశ్చయముగా కాలమును ఎవ్వడును ఉల్లంఘింపజాలడు. 

అతిక్రమించలేడు.

జైహింద్.


చింతా రామకృష్ణారావు.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.