గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జనవరి 2010, శుక్రవారం

శ్రీ శ్రీ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి చతుర్థబ్రహ్మోత్సవాలు.JPనగర్, మియాపూర్, హైదరాబాదు.









శ్లోll:-కల్యాణాద్భుత గాత్రాయ, కామితార్థ ప్రదాయినే,
శ్రీమద్వేంకట నాథాయ, శ్రీనివాసాయ మంగళం.
శ్రీ శ్రీ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి చతుర్థబ్రహ్మోత్సవాలు.నయ ప్రకాష్ నారాయణ్ నగర్, మియాపూర్, హైదరా బాదులో అతి వైభవంగా ఈ రోజు ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఈ నెల 26-01-2010 వ తేదీ వరకుఈ కార్య క్రమాలు నిర్వహింపఁ బడతాయి.ఈ రోజు జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలనే పైన ప్రదర్శించడం జరిగింది. ఆ పరమాత్మ యావత్ భక్త జనావళికీ సమస్త సన్మంగళములను కలుఁగఁజేయును గాక! 
కll:-కల్యాణాద్భుత గాత్రుఁడు,
కల్యాణాత్మకులు కోరు కామితములు సా
కల్యము చేకూర్చెడు శ్రీ
కల్యాణ తిరుమల పతికి్ కల్యాణంబుల్.
జై శ్రీమన్నారాయణ
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.