గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జనవరి 2010, బుధవారం

తే28-01-2010ని8:30amకు ఐన్యూస్ లో ఏంటీ పోర్నోగ్రఫీపై శ్రీ నల్లమోతు శ్రీధర్ తో లైవ్ షో

ప్రియ పాఠక బంధువులారా!
మనకో మంచి అవకాశం రేపు ఎదురుగా వస్తోంది.
అదేమిటంటారా?
ఐన్యూస్ లో ఏంటీ పోర్నోగ్రఫీపై శ్రీ నల్లమోతు శ్రీధర్  లైవ్ షో.

మన పిల్లలు పొర్నోగ్రపీ సైట్ల బారిన పడకుండా మనం తీసుకోవలసిన జాగ్రత్తలను గూర్చిన విషయాలపై
మన కంప్యూటర్ ఎరా నిర్వాహక మిత్రులైన
శ్రీనల్లమోతు శ్రీధర్ గారితో
ఐన్యూస్(తెలుగు)చానల్ వారులైవ్ షో ఏర్పాటు చేసారు.
వివరాలు తెలుసుకోవాలనుందా?   ఐతే చూడండి.

తే.28 - 01 - 2010. ని ఉదయం గం.8-30. ని.లకు .  I news channel లో.
మన బ్లాగ్ మిత్రులు శ్రీ నల్లమోతు శ్రీధర్ గారితో గత వారం రోజులలో రెండు పర్యాయాలు లైవ్ షో ఏర్పాటు చేసిన
మనకత్యంత ప్రీతిపాత్రమైన I news తెలుగు చానల్, ఎంతో మందికి సందేహనివృత్తికి కారణమైంది.

అనేక మంది శ్రీ నల్లమోతు శ్రీధర్ గారి సూచనలను పాటించడం ద్వారా ఆర్థిక లావాదేవీలలో తమకు రక్షణ వలయం ఏర్పాటు చేసుకో గలుగుతున్నారు.

ప్రస్తుతం అత్యంత ఆవశ్యకమైన విషయం.
ఏంటీ పోర్నోగ్రపీ అనే అంశం వివరిస్తూ, మన  పిల్లలు పోర్నోగ్రఫీ సైట్ల బారిన పడకుండా మనంతీసుకో వలసిన జాగ్రత్తలు ఈ ప్రసారంలో తెలియజేస్తారు..
ఫోన్ ద్వారా మనసందేహాలకు సమాధానాలు కూడా వెన్వెంటనే తెలియఁజేస్తారు..

కాన ఈ కార్యక్రమం ద్వారా మంచి ప్రయోజనం మనకు తప్పక చేకూరుతుందనే  అభిప్రాయంతో
ఈ విషయాన్ని మీ అందరి ముందుంచుతున్నాను.
ఇంతటి చక్కని కార్యక్రమాలనందజేస్తున్న మన ఐన్యూస్ చానల్ కు అభినందనలు.
జైహింద్. Print this post

6 comments:

పరిమళం చెప్పారు...

మొన్న ఐ న్యూస్ లోనే శ్రీధర్ గారి సెల్ ఫోన్లు తీసుకోవలసిన జాగ్రత్తలు షో చూశాను అభినందించే అవకాశం కలగలేదు ఉపయోగకరమైన అంశాలను వివరిస్తున్న శ్రీధర్ గారికి మీ బ్లాగ్ ముఖంగా అభినందనలు తెలియచేస్తున్నాను .ఈ అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు .

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పరిమళం గారూ!
నమస్తే.
ఒక చక్కని ప్రయోజన కరమైన కార్యక్రమం పదిమందికీ మనం తెలియఁజేయఁ గలిగితే ప్రయోజన కరంగా ఉంటుందన్న ఆకాంక్షతో తెలియఁజేసాను.
మీరు ఈ ప్రయోజనాన్ని పొందుతున్నట్టు తెలిసి నాకు మరీ ఆనందం కలిగిందండి.
మీ అభినందనలను మన మిత్రులు శ్రీధర్ గారికి తెలియఁజేయగలవాడను.
ధన్యవాదాలు.
భవదీయుఁడు,
చింతా రామ కృష్ణా రావు.

Unknown చెప్పారు...

పరిమళం గారు, ధన్యవాదాలండీ. బ్లాగ్లోకానికి దూరంగా ఉంటూ నెలలు గడిచినా రామకృష్ణారావు గారు, మీలాంటి మిత్రులు ఇంకా గుర్తుంచుకున్నందుకు సంతోషంగా ఉంది. రామకృష్ణారావు గారు, ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత వాస్తవానికి నా ప్రస్తావన బ్లాగ్లోకంలో వస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రోగ్రామ్ గురించి మీరు వేరొకరి ద్వారా తెలుసుకుని చేసిన మొదటి పోస్ట్ చూసినప్పుడు చాలా సంతోషమన్పించింది. మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని వినమ్రంగా కోరుకుంటున్నాను.

తెలుగు వెబ్ మీడియా చెప్పారు...

అశ్లీల వెబ్ సైట్లు చూసేవాళ్ళు ఎక్కువగా ఇంటర్నెట్ కేఫ్ లకి వెళ్తారు. నా ఇంటర్నెట్ కేఫ్ నుంచి ఒక కుర్రాడిని బయటకి గెంటి వేస్తున్నప్పుడు చెప్పాడు "ఇంటిలో సి.డి.లు పెట్టి బ్లూఫిలింస్ చూస్తే తల్లితండ్రులు తిడతారని ఇంటర్నెట్ కేఫ్ కి వచ్చి అశ్లీల వెబ్ సైట్లు చూస్తున్నాడని".

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ప్రియమైన శ్రీధరా!
అద్భుతం. అత్యద్భుతం.నే నిప్పుడే ఐన్యూస్ చానల్ ద్వారా మీ లైవ్ ప్రోగ్రాం చూసేను.
చాలా మంది యొక్క మానసిక ఆందోళనను దూరం చెయ్యగలిగారు.
ఎవరినడగాలో తెలియక, ఎలా నివారించాలో తెలియక ఇంటర్ నెట్ బాధలనింటిలోనే భరిస్తూ, పిల్లల భవిత ఎలాగరా బాబూ అంటూ చికాకు పడే వారి చికాకును పటాపంచలం చేసారు.వెరీగుడ్.మే గాడ్ బ్లెస్ యు. ధన్యవాదాలు.

Unknown చెప్పారు...

రామకృష్ణారావు గారు, ధన్యవాదాలండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.