సీ:-శ్రీ బాల కృష్ణుని చిన్మయ రూపంబు
తన్మయత్వముఁగొల్పుఁ దలచినంత
ఈ బాలకృష్ణుడు ఏడాది బాలుండు
చిలమకూరి మదికి వెలుగు పంట.
అందాల గంధాల యందంపు తిలకంబు
సుందరంబుగ దిద్ద చూపరులకు
రెప్ప వేయకఁజూడ నొప్పిదమై యుండి
చంద్ర బింబమటుల చక్కనుండె.
గీ:-ఇంత చక్కని బాలుని భ్రాంతి తీర
చూడఁ గలిగితి భాగ్యంబు తోడు కాగ.
ఇట్టి భాగ్యంబుఁ గొలిపిన దిట్ట మనదు
విజయ మోహను డెంతటి సుజనుడౌనొ!
క:-బింబాధరముననొప్పుచు
సంబరముగఁ జూచుచున్న చక్కని వాడా!
అంబుజ గర్భుని బోలు ము
ఖంబున యలరావాడ! ఘనతను గనుమా!
శ్రీమాన్ చిలమకూరి విజయ మోహనుల ముద్దుల మనుమనికి మొదటి పుట్టిన రోజు జరుపుకొనిన సందర్భంగా శుభాశీశ్శులు చెప్పుదాం. విజయ మోహనులకు అభినందనలు తెలియఁజేద్దాం.
జై శ్రీమన్నారయణ.
జైహింద్.
Print this post
2 comments:
ఆచార్యులవారికి కృతజ్ఞతలు.
మన కావ్యాల్లో మీనాక్షి, మీనలోచని, ఇలా చెబుతుంటారు కదా. అబ్బాయి కుడి కన్ను చూస్తే మీనలోచనమంటే ఏమిటో తెలుస్తూంది.
విజయమోహన్ గారూ, బుజ్జిగాడికి దిష్టి తీయించండి, దయచేసి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.