మిత్రులారా!
సంఘ జీవులమైన మనం పరస్పర సహాయ సహకారాలు చేసుకొంటూ అన్యోన్యంగా సహజీవనం సాగించడం మన విధిగా భావించాలి. ఉపకారం పొందడమే గాని, చేయడం మా యింటా వంటా లేవనే పద్ధతి అమానుషమే కదా? మన బద్దెన మహా కవి ఏమన్నాడు?
క:-
ఉపకారికి ఉపకారము
జైహింద్.
సంఘ జీవులమైన మనం పరస్పర సహాయ సహకారాలు చేసుకొంటూ అన్యోన్యంగా సహజీవనం సాగించడం మన విధిగా భావించాలి. ఉపకారం పొందడమే గాని, చేయడం మా యింటా వంటా లేవనే పద్ధతి అమానుషమే కదా? మన బద్దెన మహా కవి ఏమన్నాడు?
క:-
ఉపకారికి ఉపకారము
విపరీతము కాదు చేయ. వివరింపంగా
నపకారికి ఉపకారము
నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ.
అనే కదా అన్నాడు! మరలాంటప్పుడు ఉపకారం చేయించుకొని కూడా అది మరచిపోవడం ఎంతదారుణమండీ! ఈ విషయాన్నే రామయణంలో ఒక చక్కని శ్లోకం వివరిస్తోంది. చూడండి.
శ్లో:-
బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా!
నిష్కృతిర్వహితాసద్భిః కృతఘ్నేనాస్తి నిష్కృతిః!
గీ:-
బ్రహ్మ హత్యకు, నిల సురాపానమునకు,
చౌర్యమునకును, వ్రతభగ్న క్రౌర్యమునకు,
మంచి వారికి నిష్కృతి నెంచఁ గలదు.
కన కృతఘ్నత నిష్కృతి కానరాదు.
భావము:- సహృదయులు అనుకోని పరిస్థితులలో తమచే చేయఁబడిన బ్రహ్మ హత్యకు, సురాపానమునకు, వ్రతభంగమునకు, దొంగతనానికి ప్రాయశ్చిత్తమున్నది. కాని కృతఘ్నతకు మాత్రము నిష్కృతి లేదు.
కృతఘ్నుల మాంసము కుక్కలు సైతం తినవనికదా మన పెద్దలు అంటారు! కాబట్టి మనకెవరైనా సరే కించిత్ ఉపకారం చేసినా గాని కృతజ్ఞత చూపడం ముఖ్యం.
3 comments:
బావుంది మాష్టారూ. పూర్వకాలంలో రాజ్యాలేలే వారు సురాపానం చేసేవారు కాదా ?? అది తప్పయినా చేసేవారా లేక వారికి మినహాయింపు ఎమన్నా ఉందా శాస్త్ర ప్రకారం ?? లేక ఎవరూ చేసినా అది తప్పేనా ?? వివరించగలరు.
వాసుగారూ!
సురా పానం గురించి అడిగారు. మీ నిశిత పరిశిలనా సరళికి మిమ్ముల నభినందిస్తున్నాను.
ఇక సురాపానం విషయానికొస్తే, మీ సందేహం సముచితమే.
మీకు తెలిసున్నదే కదా! కచ దేవయాని వృత్తాంతం.
సురాపానం కచుని శాప కారణంగా నిషేధింప బడిందని చెప్ప వచ్చు. నిషేధం ఎవ్వరికైనా నిషేధమే.
ఐతే నిషేధాజ్ఞనతిక్రమిస్తే శుక్రాచార్యుని శాప ప్రభావానికి లోనై తమ సమస్త జ్ఞానాన్ని కోల్పోతారనే విషయం మనకు ప్రత్యక్ష నిదర్శనమె కదా!
నెనర్లు మాష్టారూ. మీరు ప్రస్తావించిన రెండు విషయాలు నాకు తెలియదు ఇప్పటి వరకు. వాటి గురించి ఎవన్నా లంకెలు ఉంటే ఇవ్వగలరు.
ఇంకో విన్నపం. నన్ను ఏక వచనంతో సంభోదిస్తే
మరింత సంతోషిస్తాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.