గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జనవరి 2010, బుధవారం

మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

శ్రేయో మూర్తులైన ఆంధ్రులకూ, ఆంధ్రామృత పాఠకులకూ, యావద్భారతీయులకూ, హైందవ సంప్రదాయానువర్తులకూ
మకర సంక్రాంతి పర్వ దినం సందర్భంగా
శుభాకాంక్షలు.
చ:-గుణ గణులైన మిమ్ములను, కూర్మినినున్న కుటుంబ సభ్యులన్
ఘనతరులైన మిత్రులను, గాంచుత చక్కగ
 సంకరయ్య. ని
ర్ధనులు ధనంబులన్ గలిగి, ధైర్య సమృద్ధిని గల్గి వర్ధిలున్.
ప్రణతులు చేసి వేడెదను భక్తులఁ గావఁగ దైవ శక్తికిన్.
జైహింద్.


Print this post

10 comments:

Unknown చెప్పారు...

సంకరయ్య పద ప్రయోగం బాగుందండి.
మీకు మీ కుటుంబ సభ్యుల కందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు.
దయచేసి మీ e మెయిల్ చిరునామా తెలియజేయగలరు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యవాదాలండీ నరసీహగారూ!
నా Eమెయిల్ ID
chinta.vijaya123@gmail.com.
నా సెల్: 9247238537

మాలా కుమార్ చెప్పారు...

సంక్రాంతి శుభాకాంక్షలు .

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

మీకు మీ కుటుంబ సభ్యుల కందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు.

కథా మంజరి చెప్పారు...

మీ ఆంధ్రాభిమానం, జాతీయ దృక్పధం అభినందించ తగినవి. విజయోస్తు.

కామేశ్వరరావు చెప్పారు...

మీకుకూడా సంక్రాంతి శుభాకాంక్షలండి.

Satya Narayana Sarma IRTS చెప్పారు...

చింతా రామకృష్ణారావు గారు,మీ శుభాకాంక్షలకు కృతజ్ణుణ్ణి. మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు.మీ ఆంధ్రామృతం బ్లాగును నా లిస్టులో చేర్చాను. ఈ క్రింది పద్యాన్ని అవధరించండి.

కం|| చింతలు తొలగుచు మీరిక
వింతగు శుభముల్ గలుగగ వడివడి వేడ్కన్
సంతస మొందుచు నికపై
నెంతయు నుండగ మనమున వేడెద విభునిన్||

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

వందనము రామకృష్ణుల
కందరికిని మేలుకోరు చింతలవార్కిన్
విందగు ఆంధ్రామృతములు
వందల సంక్రాంతుల నిడు వరము మహాత్మా!

Maruti చెప్పారు...

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు.

Sanath Sripathi చెప్పారు...

సంక్రాంతి శుభాకాంక్షలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.