"ఇల్లు - ఇల్లాలు"
ప్రియ ఆంధ్రామృత పాఠకులారా!
మన ప్రాచీన కాలంనుండి ఈ నాటి వరకు మన సమాజంలో స్త్రీకి ఎనలేని గౌరవప్రదమైన స్థానమున్న దన్న విషయం నిర్వివాదాంశము. "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా: "అని ఇదివరకు చెప్పుకున్నాము. అట్టి స్త్రీ మన గృహమునకు ప్రాణము వంటిది. ఆ విషయమునే మన ప్రాచీనులు చక్కని శ్లోకమున తెలిపి యున్నారు. గమనింతము.
శ్లో:-
న గృహం గృహమిత్యాహు: గృహిణీ గృహ ముచ్యతే.
గృహంతు గృహిణీ హీనం అరణ్య సదృశం మతం.
క:-
ఇల్లనరాదుగ యిల్లును?
ఇల్లాలున్నట్టి యిల్లు నిల్లనఁ జెల్లున్.
ఇల్లాలే యిల్లనఁ దగు.
ఇల్లాలే లేని యిల్లు యిల కానన మౌన్.
భావము:-
ఇంటిని కాదు ఇల్లనడం. ఇలాలిని ఇల్లనాలి. ఇల్లాలు లేని యిల్లు అడవితో సమానము!
ఇంతటి మహోన్నత స్థానాన్నాక్రమించుకొనిన స్త్రీని మన మెంత గౌరవ భావంతో చూస్తున్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఆత్మ వంచన చేసుకో నక్కర లేదు. కాని స్త్రీకి గల ఆత్మాభిమానాన్ని కూడా గుర్తించాలి. వారు కూడా ఆత్మ స్థైర్యంతో సమాజంలో బ్రతుకుతూ మనతో పాటు ఆనందమయ స్వేచ్ఛాయుత జీవనం సాగిస్తున్న తృప్తిని వారూ పొందేలాగ చేయవలసిన కనీస ధర్మం మనపై ఉన్న అంశాన్ని మనం మరువరాదు కదా!
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
3 comments:
నమస్కారములు రామకృష్ణారావుగారు " ఇల్లు ఇల్లాలు " చక్కని విషయం చెప్పారు. నిజమే మన సంస్కృతి మేలిమి బంగారమె అందునా మీరు చెప్పేవి మరింత మేలిమి. ధన్య వాదములు.
మీ పదాలు చూశాక నాదో మాటా
౧. ఉత్తములు : స్త్రీని దేవతగా , మాతృ మూర్తిగా భ్హావించి గౌరవించు వారు
౨. మధ్యములు : స్త్రీని మనిషిగా , తనతో పాటి గా భ్హావిఘ్చో వారు.
అథములు : స్త్రీని కేవలం విలాస వస్తువుగా, బానిసగా, నీచ దృష్టితో చూచేవారు
స్త్రీని విలాస వస్తువుగ చెప్పెడి ,చూచెడి మూర్ఖ వర్తనుల్
బానిసలౌదురింటి కడ, బైటను కూడను భావి లోన. య
జ్ఞాన మదాంధకారమున కన్నులు గానక దుష్ట చిత్తుడై
తానెటు పుట్టెనో తనదు తల్లికి యన్నదియున్ దలంపడే!
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.