మంచివారి కలయిక, వారి దర్శనము మంగళప్రదము. ఈ విషయమునీ క్రింది శ్లోకము వివరించు చున్నది.
శ్లో:-
గంగా పాపం శశీ తాపం దైన్యం కల్ప తరుస్తథా.
పాపం తాపంచ దైన్యంచ హంతి సజ్జన దర్శనం.
క:-
పాపముఁ బాపును జాహ్నవి.
తాపము శశి బాపు, కల్పతరువది లేమిన్
బాపును. సజ్జన సంగతి
పాపము తాపంబు దైన్య పరిహృతిఁ గొలుపున్
భావము:-గంగా ప్రవాహము పాపమును, చంద్రుడు తాపమును, కల్ప వృక్షము దైన్యమును, నశింపఁ జేస్తాయి.సజ్జన దర్శనము వలన పాప తాప దైన్యములు మూడునూ నశించును.
మంచి మార్గమ్లో నడచే మంచివారికెప్పుడూ మంచివారితో మంచి కలయిక తప్పక కలుగుతుందనడంలో సందేహం లేదు.
జైహింద్. Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.