శ్లో:-
ప్రత్యాఖ్యానేచ, దానేచ, సుఖ దు:ఖే, ప్రియాzప్రియేl
ఆత్మౌపన్యేన, పురుష: ప్రమాణ మధి గచ్ఛతిll
కం:-
ప్రత్యాఖ్యానము, దానము,
నిత్యము సుఖ, దు:ఖ, ప్రియము, నెఱ నప్రియమున్,
స్తుత్యత నాత్మౌపన్యుఁడు
నిత్యుఁడగు ప్రమాణమగుచు, నిశ్చయ మరయన్.
భావము:-
ప్రత్యాఖ్యానము నందు, దానము నందు, సుఖ దు:ఖముల యందు, ప్రియాప్రియముల యందు, తననే ఉదాహరణ ప్రాయముగా దిద్దుకోగల మనుజుఁడే లోకంలో ప్రామాణికుఁ డగుచున్నాఁడు.
జైహింద్.
Print this post
ప్రజాసంకల్పంలో నా పద్యం. లక్ష్మీ సహస్రనామావళిలో 505 వ నామం పద్యము.
-
జైశ్రీరామ్.
జైహింద్.
1 రోజు క్రితం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.