గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జనవరి 2010, గురువారం

భారతము(జయము) రత్న గర్భ.


శ్లో:-
యథా సముద్రో భగవాన్ యథా మేరుర్ మహా నగ:
ఉభౌ ఖ్యాతౌ రత్న నిధయ: తథా భారత ముచ్యతే.
క:-
రత్నములకు నిధి సంద్రము.
రత్నములకునిధి సుమేరు. రాజిలు రెండున్
రత్నములను! భారతమును
రత్నమయము తలప! భరత రత్నమె జయమౌన్.
(జయము=సంస్కృత భారతాన్ని జయము అంటారు)

భావము:-
సముద్రము మేరు పర్వతము రెండూ రత్న నిధులు అని ప్రసిద్ధి. భారతం ఆ రెంటి వంటిది.

ద్వాపరయుగంలోని వృత్తాంతాలకి తార్కాణంగా నిలిచిన భారత పురాణం నిండా మానవ జీవన సరళిని ప్రదీపింపఁజేసే అనర్ఘ రత్నాలు కోకొల్లలు.

ఏనాడైనను వెఱ్ఱి తలకెక్కిన వితండోద్దండ పండితోత్తముండతడెవ్వడేని విపరీత వ్యాఖ్యలు చేసినను ఆ వ్యాఖ్యలు కాల గర్భమున కలిసిపోవునవే కాని మహద్గ్రంథమైన భారతానికి మచ్చ వాటిల్లదు కదా!
జైహింద్.
Print this post

2 comments:

మానస సంచర చెప్పారు...

చాలా బాగా చెప్పారు మాష్టారూ.. భావానికి పది రెట్లు బావుంది మీ ముక్తాయింపు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మానస సంచరా!మదికి మంచిగ తోచిన దెల్ల నుంచి మీ
మానస మందు నిల్చుటది మాదు పురా కృత పుణ్య సత్ఫలం
బేనయ! భారతార్ణవముఁ బ్రీతిగ గాంచు టెఱుంగు వాడ! న
జ్ఞానుల దుష్ప్రభావములు కల్గకయుండెడు గాత!దీనికిన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.