చం॥
కడుఁ దురహంకృతి న్నిచట గాంచరు దుర్మతు లీశునైన, చా
వడి నిలుపున్ గదా! లలిత భావనఁ గాంచఁ గలారు లేరు గా.
మడి చెరచున్ వృథా. సుజన మందిర నాశముఁ చొప్పటంద్రు. ప్రే
ముఁడిఁ గన రేలనో! పరమ మూర్ఖత నుండెడి పాపు లయ్యరో!.
తే.గీll
ఇచటఁ గాంచరు దుర్మతు లీశునైన
లలిత భావనఁ గాంచఁ గలారు లేరు
సుజన మందిర నాశముఁ చొప్పటంద్రు
పరమ మూర్ఖత నుండెడి పాపులయ్య.
కll
దు రహంకృతి న్నిచటఁ గాం
చరు దుర్మతు లీశునైన, చావడి నిలుపున్! .
చెరచున్ వృథా. సుజన మం
దిర నాశముఁ చొప్పటంద్రు. ప్రేముడిఁ గనరే.
జైహింద్.
2 comments:
బంధకవిత్వం ఇంత విరివిగా వ్రాస్తున్నవారు నాకు తెలిసి మీరేనండీ. ఏతత్ప్రజ్ఞకు ప్రణామాలాచరించుటకంటె గొప్ప సన్మానం ఉంటుందనుకోను. పునః పునః నమోవాకములు.
చిరంజీవీ! దీర్ఘాయుష్మాన్ భవ! నీ అభిమానానికి ధన్యవాదములు. అంతా ఆ శారదాంబ దయ.
కంద,గీత. గర్భ చంపకమందుకో!
చ:-
రఘు! వర!నీవెగా! గుళికలం గురిపించితి కూర్మిఁజూపి.కూ
ర్చి.ఘటికుఁడా!సదా కవితఁ జెప్పఁగ, బొంగుచుఁగౌరవింతువే!
రఘు వరమన్నటుల్.కవిత వ్రాయ రుచుల్ గను గౌరవంబహా!
రఘుపతివేగ! తామరగ వ్రాతువు.సమ్మతి నద్భుతంబుగా!
గర్భ కందము:-
వర!నీవెగా! గుళికలం
గురిపించితి కూర్మిఁజూపి.కూర్చి,ఘటికుఁడా!
వరమన్నటుల్.కవిత వ్రా
య రుచుల్ గను గౌరవంబహా! రఘుపతివే!
గర్భ తేటగీతి:-
గుళికలం గురిపించితి కూర్మిఁజూపి.
కవితఁ జెప్పఁగ, బొంగుచుఁగౌరవింతు
కవిత వ్రాయ రుచుల్ గను గౌరవంబ
మరగ వ్రాతువు.సమ్మతి నద్భుతంబు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.