గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జనవరి 2010, బుధవారం

మేలిమి బంగారం మన సంస్కృతి 82.

శ్లో:-
నారికేళ సమాకారా దృశ్యంతేహి సుహృజ్జనా:l
అన్యే బదరికాకారా బహిరేవ మనోహరా: ll 
గీ:-
నారికేళ మట్లు ధీరోత్తములు బైట
కగపడినను మనసు కరుణ మయము.
రేఁగు పండు వోలె బాగుగా నితరులు
కనఁ బడినను లోన కఠిన మరయ.
భావము:-
మంచి మనసు గల ఉత్తములు కొబ్బరికాయ వంటి వారు.పైకి పెటుకుగా ఉన్ననూ, వారి అంతఃకరణ రస మయము. తదితరులు రేగుపండు వలె పైకిమాత్రం మనోహరమ్గానే ఉంటారు.
జైహింద్. Print this post

4 comments:

Rajasekharuni Vijay Sharma చెప్పారు...

చాలా చక్కగారాశారు.

రాంగోపాల్ చెప్పారు...

చాలా బాగుంది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజ శేఖర పేరున్న రాజ్య మేలు.
రాజ శేఖరు కృపయున్న రాణ దేలు.
రాజ శేఖర!నీ వ్యాఖ్య రమ్యమయ్య!
ధన్యవాదము లర్పింతు దయను గొనుమ.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రామ గోపాల! సద్గుణ ధామ వగుదు.
పేర్మి నాంధ్రామృతము గ్రోలి, కూర్మి తోడ
వ్యాఖ్య నందించి, జేసితి వర్ధిలంగ.
ధన్యవాదము లర్పింతు దయను గొనుమ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.