జైశ్రీరామ్.
శ్రీ నృసింహ స్తుతి.
👇
సురనర్తకీ వృత్తములో.
👇
శ్రీరమాపతికి, శ్రీనృసింహునకు జేసెద న్నతులు భక్తితో,
నీరజాక్షునకు నిత్య పూజ్యునకు నిర్మలాత్మునకు నా యెదన్
గోరి పీఠముగ కూర్మి జేసెదను, కోర నే యిహపరంబులన్,
శ్రీరమానృహరులాత్మునుండుటయె శ్రీకరంబనుచు నెంచెదన్.
🙏
ఈ వృత్తమునకు
బ్రహ్మశ్రీ ధూళిపాళ మహాదేవమణి గారు
తరంగమాల
అని నామకరణం చేశారు.
వారునూ
ఒక పద్యం వ్రాసి
అనుగ్రహించారు.
ఆ పద్యం.
👇
[1:26 pm, 02/03/2022] Mahadevamani Rjy:
ర.న.ర.న.ర.న.ర .13 యతి స్థానం.
పార్వతీ పతిని నాది దేవునిని పాశముల్ తొలగముక్తి కై.
గర్వగంధము హరించి యీ జనిని గావు మంచు పద మందెదన్
పర్వమౌచు మనసెప్పుడున్ గిరిశ భక్తి సస్యమునె పెంచగా
శర్వుడే సుఖ మఖర్వ రీతిని భృశం బిడంగను నమస్కృతుల్
[1:27 pm, 02/03/2022] Mahadevamani Rjy: దీన్ని "తరంగ మాల "అందాం.
అన్నారు.
వారికి నా ధన్యవాదములు.
జైహింద్.
Print this post
7 comments:
నమస్కారమండీ 💐🙏శ్రీ చింతా రామకృష్ణారావు గారు.. శ్రీ ధూళిపాళ మహాదేవమణి గారూ.. 🌹🙏
క్రొత్త ఛందముల గొప్పపద్యముల కూర్మి మీరు విరచింపగా
చిత్తమందు ముదమంది యెంతొ మురిసెన్ గదా నలువరాణియే!
మత్తుగొల్పెనని ధూళిపాళమణి మంచి పేరునిలనెంచగా
క్రొత్తదైనది తరంగమాల కవికోటి మెచ్చగ రహింపదే!!
మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
ర న ర న ర న ర
నమస్కారమండీ 💐🙏

ఆహా, ఎంత చక్కగా క్షణాల్లో తరంగమాల వృత్తంలో పద్యం వ్రాసి ఆశ్చర్యంకలిగించారు నాకు. చాలా సంతోషం అవధాని గారూ! ధన్యవాదాలు.
💐🙏
సత్యభాషణము సత్త్వచింతనము సౌమ్యవర్తనము భవ్యసా
హిత్య సేవనము పద్యలేఖనము హృష్ట శాబ్దిక వివేకమున్
స్తుత్య చిత్ర కవన ప్రకల్పనము సూక్ష్మ వీక్షణము సాధు సాం
గత్యమున్ దనర రామకృష్ణకవి కల్ప! నిల్వుము సుచింతలన్ !
సత్యభాషణము సత్త్వచింతనము సౌమ్యవర్తనము భవ్యసా
హిత్య సేవనము పద్యలేఖనము హృష్ట శాబ్దిక వివేకమున్
స్తుత్య చిత్ర కవన ప్రకల్పనము సూక్ష్మ వీక్షణము సాధు సాం
గత్యమున్ దనర రామకృష్ణకవి కల్ప! నిల్వుము సుచింతలన్ !
చిటితోటి విజయకుమార్
విజయ కుమార్ గారూ! మీకు నాపై ఉన్న అభిమానమునకు చాలా సంతోషంగా ఉందండి. మీరు వ్రాసిన తరంగమాల సల్లక్షణ సమన్వితంగా ఉంది. నాకు మీ అభిమాన పూర్వక శుభాకాంక్షలు అందుట నా అదృష్టంగా భావిస్తున్నానండి. నమస్తే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.