గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, మార్చి 2022, శుక్రవారం

సక్తాః కర్మణ్యవిద్వాంసో..|| 3-25 ||..//..న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం..|| 3-26 ||..//..,శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

జైశ్రీరామ్

,శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము. 

|| 3-25 ||

శ్లో. సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వన్తి భారత|

కుర్యాద్విద్వాంస్తథాసక్తశ్చికీర్షుర్లోకసంగ్రహమ్

తే.గీ. పార్థ! యజ్ఞాన వశులు తా పనుల నెట్లు

చేయుచుందురో యటులనే చేయుదు రిల

పనులు జ్ఞానులు లోకమున్ వరలఁ జేయ

నిరత నిష్కామ కర్ములై వరలుదురిల.

భావము.

అర్జునా! అజ్ఞానులు కర్మలతో మునిగి తేలుతూ ఎలా పని చేస్తారో వివేకి లోక 

శ్రేయస్సు కోరుతూఅలాగే పని చేయాలి.

|| 3-26 ||

శ్లో బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్|

జోషయేత్సర్వకర్మాణి విద్వాన్యుక్తః సమాచరన్

తే.గీ. కర్మలన్ జిక్కు నజ్జాని కలుషబుద్ధి

నెపుడు చెదరగొట్టగరా దహీన మతులు,

తాను యోగంబులో నిల్చి తనపనులను

జేయుచున్, జేయఁ జేయనౌ, ధీయుతులయి.

భావము.

కర్మలలో ఇరుక్కు పోయిన అజ్ఞానుల బుద్ధిని వివేకి చెదర కొట్టరాదు. తాను 

యోగంలో నిలిచి చక్కగాపని చేస్తూ వాళ్ళని మార్గంలో నడుస్తూ కర్మలాచరించేలా 

ప్రోత్సహించాలి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.