గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, మార్చి 2022, బుధవారం

యజ్ఞార్థా త్కర్మణోన్యత్ర..|| 3-9 ||..//సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా..|| 3-10 ||..//..శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

 జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము.

|| 3-9 ||

శ్లో. యజ్ఞార్థా త్కర్మణోన్యత్ర లోకోऽయం కర్మ బన్ధనః|

తదర్థం కర్మ కౌన్తేయ ముక్తసఙ్గః సమాచర.

తే.గీ. యజ్ఞములకని చేసెడి యట్టి కర్మ

ముల కితరమగు కర్మలన్ పూర్తిగాను

బంధనంబయ్యె లోకంబు, పార్థ! యజ్ఞ

కర్మ సంగమంబు వదలి కర్మొనర్చు.

భావము.

యజ్ఞం కోసం చేసే కర్మలకంటే ఇతర కర్మలతో లోకం బంధింప బడి 

ఉన్నది. కుంతీకుమారా యజ్ఞ కర్మలనే సంగమము వదిలి కర్మలను 

చక్కగా చేయుము.

|| 3-10 ||

శ్లో.సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః|

అనేన ప్రసవిష్యధ్వమేష వోస్త్విష్ట కామ ధుక్.

తే.గీ. యజ్ఞములతోడను ప్రజల నాప్రజాప

తియె యొనర్చి సృష్టి పలికె తీయగ నిటు

యజ్ఞములు చేసి వెలుగుడీ యసదృశమగు

కామ ధేనువు యజ్ఞంబు, క్షేమ మొదవు.

భావము.

యజ్ఞములతో సహా ప్రజలను సృష్టించి ప్రజాపతి పూర్వం విధముగా 

చెప్పెను. యజ్ఞం వలన మీరు వృద్ధి పొందుడు. అది మీ ఇష్ట కామధేనువు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.