జై శ్రీరామ్.
,శ్రీమద్భగవద్గీత
3వ అధ్యాయము. కర్మయోగము.
|| 3-35 ||
శ్లో. శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్|
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః.
తే.గీ. గుణము లేనిదైనను గాని తనదె యయిన
ధర్మమే మేలు, కన పరధర్మమేల?
నది భయంకర మరయు మో యర్జునాఖ్య!
మన సుధర్మంబె చరియింప మనకు శుభము.
భావము.
బాగా ఆచరించిన పర ధర్మం కన్నా లోపభూయిష్టమైనది ఐనా స్వధర్మం
మేలు. పర ధర్మం భయంకర మైనది.
|| 3-36 ||
అర్జున ఉవాచ|
భావము.
అర్జునుడు ఈ విధముగ అడిగెను.
శ్లో. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః|
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః
తే.గీ. కృష్ణ! పాపంబుల నెవరి ప్రేరణమున
మానవుఁడు చేయచుండెనో మదిన చేయ
నిష్టమది లేకపోయినన్? సృష్టిలోన
ప్రేర ణెవరిది పాపంబు విరివి చేయ?
భావము.
కృష్ణా! ఇష్టం లేకపోయినా ఎవరో బలవంత పెడుతున్నట్లు మానవుడు పాపం ఎందుకు
చేస్తున్నాడు?ఆ ప్రేరణశక్తి ఎవరిది?ఎవరి కారణంగా పాపం చేస్తాడు?
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.