గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మార్చి 2022, మంగళవారం

సదృశం చేష్టతే స్వస్యాః..|| 3-33 ||..//.. ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే ..|| 3-34 ||..//..,శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

   జై శ్రీరామ్.

,శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము. 

|| 3-33 ||

శ్లో. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి|

ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి.

తే.గీ. అనుసరించు సత్ జ్ఞానియు నాత్మ ప్రకృతి,

యాత్మ ప్రకృతినే ప్రాణులు ననుసరింపఁ

గలవు గ్రహియింప, నిగ్రహ బల మదేమి

చేయఁ గల్గును? పార్థ! సు జ్ఞేయ మిదియె.

భావము.

జ్ఞానవంతుడైనా తన ప్రకృతి ననుసరించే వ్యవహరిస్తాడు. ప్రాణులు 

తమ ప్రకృతిని అనుసరిస్తాయి. నిగ్రహమేమి చేస్తుంది.

|| 3-34 ||

శ్లో. ఇన్ద్రియస్యేన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ|

తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినౌ.

తే.గీ. ఇంద్రియము లన్నిటి విషయ మెంచి చూడ

రాగములు ద్వేషముల్గల్గు, ప్రథిత కర్మ

యోగి లోబడ రాదట్టి రాగములకు

ద్వేషముల కవే శత్రువుల్ తెలియుమిదియె.

భావము.

ప్రతి ఇంద్రియ విషయంలోను రాగాద్వేషాలు ఉంటాయి. కర్మయోగి వాటికి 

లోబడ రాదు. అవేఅతనికి శత్రువులు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.