గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, మార్చి 2022, మంగళవారం

యదా యదా హి ధర్మస్య .. || 4-7 ||..//..పరిత్రాణాయ సాధూనాం, .|| 4-8 ||...//.. జ్ఞాన కర్మ సన్యాసయోగః

 జైశ్రీరామ్.

|| 4-7 ||

శ్లో. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత|

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్

తే.గీ. ధర్మ మది క్షీణమగుచు నధర్మ మెపుడు

వృద్ధి యగుచుండు నప్పు డేన్ పృథ్విపైన

పుట్టు చుందు నధర్మమున్ మట్టుపెట్టి

ధర్మ సంరక్షణను జేయ ధర్మ మిదియె. 

భావము.

అర్జునా! ఎప్పుడు ధర్మము క్షీణించి అధర్మం వృద్ధి చెందుతుందో 

అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను.

|| 4-8 ||

శ్లో. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతామ్|

ధర్మసంస్థాపనార్థాయ సమ్భవామి యుగే యుగే.

తే.గీ. సాధు జనులను రక్షింప, సమయు నటుల

జేయ దుష్కృతులను భువిన్, జేయగాను

ధర్మ సంస్థాపనంబును  ధరను నేను

సంభవింతు యుగయుగములంభరతజ!

భావము.

సాధువులను రక్షించడానికి, దుష్టులను నాశనం చేయడానికీ, ధర్మాన్ని 

నెలకొల్పడానికి యుగ యుగంలోను నేను జన్మిస్తాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.