గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, మార్చి 2022, ఆదివారం

కర్మ బ్రహ్మోద్భవం విద్ధి ..|| 3-15 ||..//..ఏవం ప్రవర్తితం చక్రం..|| 3-16 ||..//..శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

 జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము.

|| 3-15 ||

శ్లో. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్|

తస్మాత్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్.

తే.గీ. బ్రహ్మచే కర్మ కలిగెను, బ్రహ్మ చూడ

మహిత పరమేశుచేఁ గల్గె, మదిని గాంచ

సర్వమున వ్యాప్తుఁడై వెల్గు శక్తి యతఁడె

యజ్ఞమందు ప్రతిష్ఠితుం డరయ నతఁడె.

భావము.

కర్మ బ్రహ్మదేవుని వలన జనించినది. బ్రహ్మ అనంతమైన పరమాత్మ వలన 

ఉద్భవించెను. కాబట్టిసర్వ వ్యాపకమగు పర బ్రహ్మము నిత్యమూ యజ్ఞములో 

ప్రతిష్టితమై యుండునని తెలుసుకొనవలయును.

|| 3-16 ||

శ్లో. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః|

అఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ జీవతి.

తే.గీ. ఇట్టి భ్రమియించు చక్రము నెవఁడు భువిని

యనుసరించఁడొ పాపి తా నర్జున! కన

నింద్రియములకు లోనౌచు నెన్న రాని

పాపి, నిజమిది కను మది భ్రాంతివీఢి.

భావము.

ఇలా పరిభ్రమించే చక్రాన్ని అనుసరించని వాడు పాపి, ఇంద్రియలోలుడు,

అర్జునా;అతడుజీవించడం వ్యర్ధం.

జైహింద్. 

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.