జై శ్రీరామ్..
,శ్రీమద్భగవద్గీత
3వ అధ్యాయము. కర్మయోగము.
|| 3-27 ||
శ్లో. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః|
అహఙ్కారవిమూఢాత్మా కర్తాహమితి మన్యతే
తే.గీ. ప్రకృతి గుణములన్ కర్మలు వరలఁ గలవు,
మూఢుఁ డనుకొను తానిటన్ మూలముగ
నన్నిటికిని కారణమని, యహము వలన
జ్ఞాని తలఁపడటులకను జ్ఞానభస!
భావము.
ప్రకృతి గుణాల వలన అన్ని కర్మలు నిర్వహింప బడతాయి. అహంకారము
వలన భ్రమించినమూఢుఁడు తానే కర్తనని తలపోస్తాడు.
|| 3-28 ||
శ్లో. తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః|
గుణా గుణేషు వర్తన్త ఇతి మత్వా న సజ్జతే
తే.గీ. మహిత బల! గుణ కర్మల మహిత తత్వ
మెఱిగి యున్నట్టివాఁడు తా నెఱిఁగి గుణము
గుణమునందె వర్తించెడు ననుచు, తగులు
కొనడు కర్మలలో తాను ఘనుఁ డతండె.
భావము.
మహాబలుడా! గుణకర్మ విభాగాల తత్వం తెలిసిన వాడు
గుణాలు గూణాలలో వర్తిస్తాయని తెలిసి ఆకర్మలలో తగుల్కోడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.