గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మార్చి 2022, గురువారం

కామ ఏష క్రోధ ఏష రజో..|| 3-37 ||..//.. ధూమేనావ్రియతే వహ్నిర్య..|| 3-38 ||..//..శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

 ,జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము. 

|| 3-37 ||

శ్రీభగవానువాచ|

భావము.

శ్రీ భగవానుఁడు ఇట్లు పలుకుచుండెను.

శ్లో. కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః|

మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్.

తే.గీ. క్రోధ కామముల్ కన  రజో గుణము నుండి

యుద్భవించు నాకలి దానికుండు మెండు,

పాప మూల రజోగుణ వర్ధనంబె

శత్రు వందరికీధరన్, సరిగ కనుమ.

భావము.

ఇవి కామము, క్రోధము, రజోగుణం నుండి ఉద్భవిస్తాయి. దానికి మహా ఆకలి

అది పాపిష్టిది.ఈలోకంలో అందరికి అదే శత్రువని తెలుసుకో.

|| 3-38 ||

శ్లో. ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన |

యథోల్బేనావృతో గర్భ స్తథా తేనేదమావృతమ్.

తే.గీ. అగ్నిని పొగయును, మలిన మద్దమును, మరి

మావి శిశువును క్రమ్మునట్లే విజయుఁడ!

క్రమ్మివేయును  జ్ఞానమున్ గామమరయ,

కామమును గెల్చువారలే ఘనులు భువిని.

భావము.

అగ్నిని పొగ ఆవరించినట్లు, అద్దాన్ని దుమ్ము కప్పినట్లు, గర్భస్త శిశువుని మావి 

కప్పినట్లు జ్ఞానాన్నికామం కప్పి వేస్తుంది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.