జైశ్రీరామ్.
శ్రీమద్భగవద్గీత
3వ అధ్యాయము. కర్మయోగము.
|| 3-7 ||
శ్లో. యస్త్విన్ద్రియాణి మనసా నియమ్యారభతేర్జున|
కర్మేన్ద్రియైః కర్మయోగమసక్తః స విశిష్యతే.
తే.గీ. పార్థ! జ్ఞానేంద్రియములను వశమునందు
మనసుచే నుంచుకొనుచు తా మానకుండ
కర్మ యోగ మనాసక్తి ధర్మ మరసి
చేయు నాతఁడు శిష్ఠుఁడు, జీవితమున.
భావము.
అర్జునా! జ్ఞానేంద్రియాలను మనస్సు ద్వారా నిగ్రహించి, కర్మేంద్రియాల
ద్వారా అసక్త భావంతోకర్మయోగాన్ని ఎవరు ప్రారంభిస్తాడో అతడు
విశిష్టుడు అవుతాడు.
|| 3-8 ||
శ్లో. నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః|
శరీర యాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేదకర్మణః.
తే.గీ. నీదు విధ్యుక్త ధర్మంబు నీవొనర్చు,
కర్మమానుట కంటె యా కర్మ చేయు
టనునదియె మేలు, కర్మ చే యక మనుటన
భువిని కష్టము తలఁపగా ప్రవర! పార్థ!
భావము.
నీ విధ్యుక్త కర్మని నీవు చెయ్యి. కర్మ మానడం కంటే కర్మ చేయడం మేలు.
కర్మ చేయకపోతే శరీరయాత్ర జరగదు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.