జైశ్రీరామ్.
అథ చతుర్థోధ్యాయః - జ్ఞానకర్మసంన్యాసయోగః
|| 4-1 ||
శ్రీభగవానువాచ|
భావము.
శ్రీ కృష్ణభగవానుడు పలికెను.
శ్లో. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్|
వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేబ్రవీత్
తే.గీ. ఘనతరంబుగ కర్మ యోగంబు రవికి
బోధఁ జేసితి, తానది బోధఁ జేసె
మనువు, కాతఁ డిక్ష్వాకున కును తెలిపె, న
నన్య మిదియు తెలియుము, ఫర్జన్య! తెలియ.
భావము.
అవ్యయమైన ఈ కర్మయోగాన్ని నేను సూర్యుడికి భోదించాను. సూర్యుడు
మనువుకి చెప్పాడు. మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు.
|| 4-2 ||
శ్లో. ఏవం పరమ్పరాప్రాప్తమిమం రాజర్షయో విదుః|
స కాలేనేహ మహతా యోగో నష్టః పరన్తప.
తే.గీ. రాజ ఋషు లెఱింగిన యట్టి రాజయోగ
మిది, పరంతపా! ప్రాప్తించె నిల పరంప
రగనె, పరికింప నీయోగ మగణితమెగ
కాలగర్భంబులో నేడు కలిసిపోయె.
భావము.
ఇలా పరంపరగా ప్రాప్తమైన కర్మయోగాన్ని రాజర్షులు ఎరుగుదురు.
ఓ పరంతపా! కాల గతిలో ఈ గొప్ప యోగం ఈ లోకంలో నశించి పోయింది.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.