గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, మార్చి 2022, బుధవారం

శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటి. (సతీ శతకము) 3వపద్యము.

🙏ఓం శ్రీమాత్రే నమః.🙏
శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటిలో 3వ పద్యము. 3. నీ రూపమే కనిన నేరూపమున్ గనఁగఁ గోరంగ లేము ధరణిన్, ధారాళ సత్ కవిత పారున్ నినుం గనిన శ్రీరమ్య తేజ నిలయా. పారాడు దుర్గతుల నేరీతిఁ బాపుదువొ చేరంగ నిన్ శుభ మతిన్, వారాహి నిన్ దలచు వారే మహాత్ములిల వారిన్ నుతింతును సతీ! భావము. ఓ సతీమాతా! నీ దివ్యమయిన రూపమును చూచినచో భూమిపై మరే రూపమును చూడవలెనని కోరలేమమ్మా. లక్ష్మీప్రదమయిన కాంతికి నిలయమయిన తల్లీ!నిన్ను చూచినచో ధారాళమయిన మంచి కవిత్వము ఉరకలు వేయుచు వచ్చును.ంఅంచి మనసుతో నిన్ను నేను చేరుట కొఱకు ఈ నడచుచున్న దుర్గతిని నీవు ఏ విధముగాపోగొట్టుదువో కదా.ఓ తల్లీ!నిన్ను భూమిపై నిన్ను తలచునటువంటివారే మహాత్ములమ్మా. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.