గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, మార్చి 2022, బుధవారం

యద్యదా చరతి శ్రేష్ఠ..|| 3-21 ||,,//..న మే పార్థాస్తి కర్తవ్యం..|| 3-22 ||..//..శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

 జై శ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము.

|| 3-21 ||

శ్లో. యద్యదా చరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|

యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే.

తే.గీ. శ్రేష్టుఁ డెద్దానిఁ జేయునో జేయుదు రదె

జనులు, దేనిని శ్రేష్టుఁడు ఘనతరముగ

తగ ప్రమాణంబుగాఁ గొను దాని నరసి

స్వీకరింతురు జనులెల్ల లోకమునను.

భావము.

శ్రేష్టుడు దేనినైతే ఆచరిస్తాడో, దానినే ఇతర జనులు ఆచరిస్తారు. అతడు దేనిని 

ప్రమాణంగాస్వీకరిస్తాడో దానినే లోకం అనుసరిస్తుంది.

|| 3-22 ||

శ్లో. మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కిఞ్చన|

నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ కర్మణి

తే.గీ. పార్థ! యీ మూడులోకాల వరల నాకుఁ

జేయ వలసిన పనిలేదు, చిత్తమలర

మునుపు పొందక యున్నది, పొందఁ దగిన

దేదియున్ లేదు, కర్మల నిటులె యుందు.

భావము.

అర్జునా నాకు మూడు లోకాలలో చేయవలసిన పని లేదు.ఇంతకు 

ముందు పొందకుండా ఉన్నదిముందు పొందవలసినది ఏమీలేదు.అయిననూ 

కర్మలలో వర్తిస్తాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.