గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

5, మార్చి 2022, శనివారం

యజ్ఞశిష్టాశినః సన్తో ముచ్యన్తే ,,|| 3-13 ||..//..అన్నాద్భవన్తి భూతాని ..|| 3-14 |..//..శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

  జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము.

|| 3-13 ||

శ్లో. యజ్ఞశిష్టాశినః సన్తో ముచ్యన్తే సర్వకిల్బిషైః|

భుఞ్జతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మ కారణాత్.

తే.గీ. దేవతల కిచ్చి, మిగిలును తినిన, పాప

ములు వాయు, ధన్యుఁడౌ పుడమిపైన,

తనకు వండుకొనుచు తిను ధర్మబాహ్యుఁ

డరయపాపంబు తినుటగు, వరలఁ బోడు.

భావము.

యజ్ఞంలో దేవతలకు ఇవ్వగా మిగిలినది తినేసజ్జనుడు అన్ని పాపాలనుండి 

విముక్తుడు అవుతాడు.తమ కోసం మాత్రం ఎవరు వండు కునే పాపాత్ములు 

వాళ్ళు పాపాన్నే తింటారు.

|| 3-14 ||

శ్లో. అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్నసమ్భవః|

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః

తే.గీ. అన్నమునఁ బుట్టు జీవులా యన్న మరయ,

మేఘమునసంభవంబగు మేఘ మరయ

యజ్ఞమున సంభవంబగు యజ్ఞ మరయ

కర్మ వలన సంభవమగు, కనుము పార్థ!

భావము.

అన్నము వలన జీవులు పుట్టును,అన్నము మేఘము వలన పుట్టును, మేఘము 

యజ్ఞము వలనపుట్టును, యజ్ఞము కర్మ వలననే సంభవము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.