గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, మార్చి 2022, సోమవారం

యస్త్వాత్మరతిరేవ..|| 3-17 ||..//.. నైవ తస్య కృతేనార్థో..|| 3-18 ||..//..శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

 జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము.

|| 3-17 ||

శ్లో. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః|

ఆత్మన్యేవ సన్తుష్టస్తస్య కార్యం విద్యతే.

తే.గీ. ఆత్మ లోన రమించుచు, నాత్మలోన

పూర్ణ తృప్తిని బొందెడు పూజ్యున కిక

చేయ వలసినదేదియు క్షితిని లేదు,

బ్రహ్మజీవైక్యసిద్ధియే పరమపథము.

భావము.

ఆత్మలోనే రమిస్తూ, ఆత్మలోనే పరిపూర్ణ తృప్తిని పొందే వాడికి 

చేయవలసిన  కార్యమంటూ లేదు.

|| 3-18 ||

శ్లో. నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన|

చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః.

తే.గీ. అతనికి పని చేయంగ మేలరయ లేదు,

చేయకున్నను నష్టంబు చేరఁ బోదు.

తన కొఱ కితరులపయిన తానెపుడును

కనగ నాధారపడఁ బోడు కనుము నిజము.

భావము.

అతడికి పని చేయడం వలన ప్రయోజనం కాని, మానడం వలన దోషం కాని 

ఏమీ ఉండదు. తన ప్రయోజనం కోసం సమస్త ప్రాణులలోనూ దేనిపైనా 

ఆధారపడడు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.