గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మార్చి 2022, మంగళవారం

శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటి. (సతీ శతకము) 4వ పద్యము.

జై శ్రీరామ్.
జైశ్రీమాత్రే నమః.🙏
శ్రీ అష్టోత్తర శత సతీ అశ్వధాటి. (సతీ శతకము) 4వ పద్యము.

4. శక్తి ప్రదాతవని ముక్తిప్రదాతవని భక్తిన్ నినున్ గొలిచెదన్ 
భక్తాగ్రగణ్యులు విముక్తిన్ గనన్ మిగుల రక్తిన్ నినున్ గొలుతురే. 
రక్తాక్షివై దురిత శక్తిప్రపూర్ణులను రక్తంబు చిందఁ గనుమా. 
యుక్తంబు లిచ్చుచు నయుక్తంబులన్ దరుము యుక్తిప్రదా వర సతీ!

భావము.
ఓ శ్రేష్టురాలివైన సతీమాతా! నీవు శక్తిని, ముక్తిని కలుగఁజేయు తల్లివని భక్తితో 
నిన్ను కొలిచెదను. గొప్ప భక్తులు ఈ సంసార బంధములనుండి విముక్తి 
పొందుట కొఱకు మెక్కిలి అనురక్తితో నిన్ను సేవించుదురు కదా. దుర్మార్గుల 
విషయమున నీవు కన్నులు కోపములురక రక్తము చిందువిధముగా 
శిక్షింపుము. ఓ యుక్తిని ప్రసాదించు తల్లీ! మాకు అనుభవింపఁదగినవే 
ప్రసాదింపుము. అయుక్తములయినవాటిని పోఁగొట్టుము.

🙏
అమ్మకు వందనములతో
రచన చింతా రామకృష్ణారావు.
గానం శ్రీ కుమార సూర్యనారాయణ. విజయవాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.