గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, మార్చి 2022, గురువారం

యే యథా మాం ప్రపద్యన్తే..|| 4-11 ||..//..కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం - || 4-12 ||..//..జ్ఞాన కర్మ సన్యాసయోగః

A జైశ్రీరామ్.

|| 4-11 ||

శ్లో. యే యథా మాం ప్రపద్యన్తే తాంస్తథైవ భజామ్యహమ్|

మమ వర్త్మానువర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః.

తే.గీ. ఎవ్వ రెట్టుల నన్గొల్తు రీప్సితముగ

వారి నట్టులే నేనును పార్థ! కనుదు,

నాదు జాడలోనే జనుల్నడచుదు రిల, 

నీవు గ్రహియింప వలెనిది నేర్పుమీర.

భావము. 

అర్జునా! నన్ను ఎవరు ఎలా కొలిస్తే నేను వారిని అలాగే అనుగ్రహిస్తాను. మనుష్యు

లెప్పుడూ నా జాడలోనే సంచరిస్తారు.

|| 4-12 ||

శ్లో. కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం యజన్త ఇహ దేవతాః|

క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా.

తే.గీ. కర్మ ఫలములు పొందంగ ఘనతరముగ

దేవతాళిని పూజింత్రు తృప్తి గనగ

కర్మ ఫలములు లభియించు ఘనతరముగ

వేగముగ, పార్థ! గ్రహియించు ప్రీతితోడ.

భావము.

కర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు, మానవ 

లోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా!

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.