జైశ్రీరామ్.
6. రక్షించు మా జనని! రక్షించుమా, జన నిరీక్షన్ మదిన్ దలచుమా.
రక్షింతువీవని నిరీక్షించు సజ్జనులు మోక్షప్రదా! కనుమికన్.
సాక్షాత్కరింప కిటు శిక్షింపగా తగున? దాక్షాయినీ! కను మమున్,
లాక్షారుణప్రభల శిక్షించు దుష్టులను రక్షించు మమ్మిక సతీ!
భావము.
ఓ సాతీ మాతా! రక్షించుము తల్లీ! నీ రక్షణ కొఱకై
జనుల ఎదురు చూపులను
మనసులో తలచుకొని, గుర్తించి, రక్షించుము. ఓ
మోక్షప్రదా! నీవు
రక్షించుదువని మంచివారైన నీ భక్తులు ఎదురు
చూచుచుండిరి. అది నీవు
గమనించి రక్షించుము. వారికి నీ సాక్షాత్కారమును
కలుగుఁజేయక ఈ
విధముగా శిక్షించుట నీకు తగదు. ఓ దాక్షాయనీ!
మమ్ము చూడుము. నీ
ఎఱ్ఱని ప్రభలతో దుష్టులను శిక్షించుము. మమ్ములను
రక్షించుము.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.