గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, మార్చి 2022, శుక్రవారం

ఆవృతం జ్ఞాన మేతేన..|| 3-39 ||..//..ఇన్ద్రియాణి మనో బుద్ధి..|| 3-40 ||..//..|శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము. కర్మయోగము.

  ,జైశ్రీరామ్.

శ్రీమద్భగవద్గీత

3వ అధ్యాయము.  కర్మయోగము.

|| 3-39 ||

శ్లో. ఆవృతం జ్ఞాన మేతేన జ్ఞానినో నిత్య వైరిణా|

కామ రూపేణ కౌన్తేయ! దుష్పూరే ణానలేనచ.

తే.గీ. కామమది తృప్తిఁ గలిగింపఁ గాని యగ్ని,

జ్ఞానమున కది వైరి, సు జ్ఞానమునది

కప్పివేయును, మనుజుని కనులు మాయ

క్రమ్మి కామాగ్ని దగ్ధుఁడై కనడు నిజము.

భావము.

కామం తృప్తి పరచడానికి వీలులేని అగ్ని వంటిది.ఇది జ్ఞానానికి నిత్య శత్రువు

దీనితో జ్ఞాని జ్ఞానంకప్పబడి ఉంటుంది.

|| 3-40 ||

శ్లో. ఇన్ద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే|

ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్.

తే.గీ. కామమునకు నాధారముల్ కనగ బుద్ధి

యింద్రియంబులు, మనసు, జ్ఞానేంద్రియమును

కామమది కప్పి వ్యామోహ కలితుఁ జేయు

మానవుని కాన కామమున్ మాపవలయు.

భావము.

ఇంద్రియములు, మనస్సు, భుద్ధి, కామానికి ఆధార స్థానములు అని చెప్పబడు

తున్నవి. కామముజ్ఞానమును కప్పి వేసి ఇంద్రియాల ద్వారా దేహధారిని వ్యామోహ 

పరుచును

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.