జైశ్రీరామ్.
జ్ఞాన కర్మ సన్యాసయోగః
|| 4-13 ||
శ్లో. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః|
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్.
తే.గీ. గుణము కర్మంబులన్ నాలుగు విధములగు
వర్ణములు గొల్పినాడ నే వరలజేయ,
కాను సృష్టి జేసిన నేను కర్త ననియు,
మార్పు లేనివాడననియు మందిని గనుమ.
భావము.
నాలుగు విదాలైన వర్ణాలు గుణ కర్మల విభజనలను అనుసరించి నా వలన
సృష్టించ బడ్డాయి. వాటిని సృష్టించిన వాడినైనా నేను కర్తను కాననీ,
మార్పులేని వాడిననీ తెలుసుకో.
|| 4-14 ||
శ్లో. న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా|
ఇతి మాం యోऽభిజానాతి కర్మభిర్న స బధ్యతే.
తే.గీ. నన్ను కర్మలంటవనియు, నాకు నెపుడు
కర్మ ఫల వాంఛ లేదని ఘనతరముగ
నెరుగు వాడు కట్టుబడడు వరలునట్టి
కర్మ ఫలముల చే పార్థ! కనుము నిజము.
భావము.
నన్ను కర్మలంటవనీ నాకు కర్మ ఫలముపై కోరిక లేదనీ ఎరిగినవాడు కర్మలచేత
కట్టుబడడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.