గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2022, బుధవారం

గణనాథునికి ఏకవింశతి పత్ర పూజ.

జైశ్రీరామ్.

ఏకదంతునకు  ఏకవింశతి పత్రపూజ

(21 విధముల పత్రములతో పూజ)

 సీ.  సుముఖ! మాచీపత్రముమదిని గొనుమయ్య, 

బృహతిని గణనాథ మహిత! కొనుమ,


బిల్వము గొనుమయ్య ప్రీతినుమాపుత్ర!

గజముఖ! గొనుమయ్య గరిక నీవు,


హరసూన! దుత్తూరమందుకొనుము కృపన్

బదరి లంబోదరా! మదిని గొనుమ,


యొప్ప నపామార్గ మో గుహాగ్రజ కొను,

గజకర్ణ! తులసిని ఘనతఁ గొనుమ,


యేకదంతా! కొను మిదె చూతపత్రంబు, 

వికటా! కొనుము కర వీరమిదిగొ,


భిన్నదంతా! కొను ప్రీతి విష్ణుక్రాంత 

మున్, వట! దాడిమిన్ ముదము గొనుము,


దేవదారున్ గొను దివ్య సర్వేశ్వరా!

ఫాలచంద్రా! మరువంబు గొనుమ,


యీ సింధువారమున్ హేరంబ! కొనుమయ్య, 

శూర్పకర్ణా! జాజి శుభద! కొనుము,


యల గండకిఁ గొను సురాగ్రజా! యిభవక్త్ర! 

కొనుము శమీ పత్రము నయమలర,


నశ్వత్థ మిదె కొను మరసి వినాయకా!

సురసేవితా!ర్జునమరసి కొనుము,


తే.గీ.  కపిల! కొనుమర్క పత్రంబుఁ, గరుణ తోడ,

నేకవింశతి పత్రంబు లిటులఁ గొనిన

శ్రీగణేశా! శుభాకరా! చిత్తమలర

చెంగుచెంగున గెంతుచు చెలగుమిచట.


శ్రీ గణేశాయనమః ఏకవింశతి పత్రాణి పూజయామి,

సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।

గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।

ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।

గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి

హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।

లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।

గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।

గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,

ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,

వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।

భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,

వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,

సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,

ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,

హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి

శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,

సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,

ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,

వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,

సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।

కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।

శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.