గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఆగస్టు 2022, శుక్రవారం

యద్యద్విభూతిమత్సత్త్వం ...10 - 41...//..అథవా బహునైతేన కిం , , .10 - 42,,,//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

 జైశ్రీరామ్.

|| 10-41 ||

శ్లో.  యద్యద్విభూతిమత్సత్త్వం శ్రీమదూర్జితమేవ వా|

తత్తదేవావగచ్ఛ త్వం మమ తేజోంऽశసమ్భవమ్.

తే.గీ.  ఏది కలదోవిశిష్టమై మేదినిపయి,

శోభయున్ శక్తిగలదేదో, శుభగుణాఢ్య!

యరయనదియంథయున్ నాదు పరమ శక్తి

నుండియే కల్గుటరయుమా ఖండితమీగ.

భావము.

విశిష్టమైన గుణమూ, శోభా, శక్తీ కలిగినది ఏది ఉన్నదో ఆప్రతీదీ 

నా తేజము నుండి పుట్టినదని తెలుసుకో.

|| 10-42 ||

శ్లో.  అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున|

విష్టభ్యాహమిదం కృత్స్నమేకాంశేన స్థితో జగత్.

తే.గీ. ఇన్ని మాటలవేల? నివన్నిటి గన

నేనె భరియించుచుండిటు నిలిచినాడ

నొక్క యంశతోమాత్రమే నిక్కమిదియె,

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.

భావము.

అర్జునా! ఇన్ని మాటలు దేనికి ఈ యావత్ప్రపంచాన్ని నేను 

ఒక్క అంశతో భరించి నిలిచి ఉన్నాను.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

విభూతియోగో నామ దశమోऽధ్యాయః.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.