గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, ఆగస్టు 2022, శనివారం

మదనుగ్రహాయ పరమం ...11 - 1...//..భవాప్యయౌ హి భూతానాం , , .11 - 2,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

 జై శ్రీరామ్.

 అథైకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

అర్జున ఉవాచ|

భావము

అర్జునుడిట్లనియె.

|| 11-1 ||

శ్లో. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్|

యత్త్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ.

తే.గీ. నన్ననుగ్రహించుటకయి మన్ననమున

ఘన రహస్యమౌనయధ్యాత్మ వినుత మయిన

జ్ఞాన బోధనన్ బొడమె సుజ్ఞానమనఘ!

మోహమంతమైపోయెను మోహనాంగ!

భావము.

నన్ను అనుగ్రహించుటకై కరుణతో నీచేత చెప్పబడిన పరమ 

రహస్యమైన అధ్యాత్మఙ్ఞానముచే నా అఙ్ఞాన మోహమంతా 

మాయమైపోయినది.

 || 11-2 ||

శ్లో.  భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా|

త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయమ్.

తే.గీ.  భూత సృష్టిస్థితిలయలు మూలమయిన

ఘన రస్యమున్, నీ యందు కలుగు మహతి

నీవు చెప్ప నెరింగితి నీరజాక్ష!

విస్త్రుతంబుగ నేనిట విశదమాయె.

భావము.

హే కృష్ణా! సర్వభూతముల సృష్టి, స్థితి, లయ రహస్యమును

 గూర్చి నీ శాశ్వతమయిన అవ్యయమైన మహా మహిమను గూర్చి 

నీవు చెప్పగా నేను సవిస్తారముగా వింటిని.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.