జైశ్రీరామ్.
|| 10-33 |
శ్లో. అక్షరాణామకారోऽస్మి ద్వన్ద్వః సామాసికస్య చ|
అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః|
తే.గీ. అక్షరంబులనక్షర మరయ నేనె,
ద్వంద్వమనుసమాసమునేనె ధర సమాస
ములను, నాశ రహితకాలము కన నేనె,
సర్వతోముఖేశ్వరుడేనె గర్వరహిత!
భావము.
నేను అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని,
నాశనంలేని కాలాన్ని. సర్వతోముఖంగా ఉండే ఈశ్వరుడిని.
|| 10-34 |
శ్లో. మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ భవిష్యతామ్|
కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా|
తే.గీ. మృత్యువున్ బుట్టుకయు నేనె మేదినిపయి,
స్త్రీలలో కీర్తి, సృతి, వాక్కు, శ్రీయు నేనె,
క్షమయు, ధృతియును, మేధయున్, కనగ నేనె,
నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.
భావము.
నేను సర్వాన్ని హరించే మృత్యువుని, భవిష్యత్తులో ఊదయించబోయే
వారి పుట్టుకని, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి,
క్షమా గుణాలు కూడానేనే.ధృతి, క్షమా గుణాలు కూడానేనే.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.