గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, ఆగస్టు 2022, మంగళవారం

ఉచ్చైఃశ్రవసమశ్వానాం ...10 - 27...//..ఆయుధానామహం వజ్రం .10 - 28,,,//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

 జైశ్రీరామ్

 || 10-27 |

శ్లో.  ఉచ్చైఃశ్రవసమశ్వానాం విద్ధి మామమృతోద్భవమ్|

ఐరావతం గజేన్ద్రాణాం నరాణాం చ నరాధిపమ్|

తే.గీ. అరయ  నుచ్చైశ్రవమును నే నశ్వములను,

కరులనైరావతమునే నలసి చూడ,

మనుజులందున రాజును, వినుము పార్థ!

నన్ను నరయగ యత్నించు మన్ననమున.

భావము.

నేను గుర్రాలలో అమృతంతో పుట్టిన ఉచ్చైశ్రవాన్ని, ఏనుగులలో 

ఐరావతాన్ని, మనుష్యులలో రాజుని.

|| 10-28 ||

శ్లో.  ఆయుధానామహం వజ్రం, ధేనూనామస్మి కామధుక్|

ప్రజనశ్చాస్మి కన్దర్పః, సర్పాణామస్మి వాసుకిః.

తే.గీ. ధొత్రి నరసిన వజ్రాయుధంబు నేనె,

కామధేనువునావులన్, కాముడనయ

జన్మనిచ్చెడివారిలో, సర్పములను

వాసుకిని నేనె తెలియుము పార్థ!  నీవు.

భావము.

నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో 

మన్మధుడిని, సర్పాలలో వాసుకిని.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.