గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, ఆగస్టు 2022, శనివారం

పశ్యామి దేవాంస్తవ దేవ ...11 - 15...//..అనేకబాహూదర వక్త్ర , , .11 - 16,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

  జైశ్రీరామ్.

|| 11-15 |||

శ్లో.  పశ్యామి దేవాంస్తవ దేవ దేహే

సర్వాంస్తథా భూతవిశేషసఙ్ఘాన్|

బ్రహ్మాణమీశం కమలాసనస్థ-

మృషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్.

తే.గీ. నీ విరాట్రూపమందున నేను కంటి

ప్రాణి కోటిని, బ్రహ్మను, భస్మధరుని,

దేవతాళిని, ఋషులను, దివ్యమైన 

పాములన్, గృష్ణ! మదిలోన భ్రాంతి తొలగె.

భావము.

ఓ దేవాదిదేవా! నీ విరాట్-రూపమునందు సకల దేవతలను, 

నానావిధప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన 

శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను.

|| 11-16 ||

శ్లో.  అనేకబాహూదర వక్త్రనేత్రం,

పశ్యామి త్వాం సర్వతోऽనన్తరూపమ్|

నాన్తం న మధ్యం న పునస్తవాదిం

పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప.

తే.గీ.  నీదు బాహువు లుదరముల్, నీదు ముఖము

లును, నయనము లనంతముల్, ఘనతరమగు

నీదు విశ్వతోముఖ రూపంబు నేగనదగ

నాదిమధ్యాంత రహిత! నన్నాదుకొనుము.

భావము.

ఓ విశ్వేశ్వరా! విశ్వరూపా! నీ బాహువులు, ఉదరములు, ముఖములు, 

నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంతరూపము సర్వతోముఖముగ 

విలసిల్లుచున్నది. నీవు ఆదిమధ్యాంతరహితుడవు. మహత్వ పూర్ణమైన

 నీ దివ్యరూపమునకు ఆది మధ్యాంతములను తెలిసికొనలేకున్నాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.