గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, ఆగస్టు 2022, బుధవారం

అనన్తశ్చాస్మి నాగానాం ...10 - 29...//..ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం, .10 - 30,,,//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

 జైశ్రీరామ్.

 || 10-29 ||

శ్లో.  అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|

పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్.

తే.గీ.  నాగు లందు ననంతుండ, నయనిధాన!

జలచరంబులన్ వరుణుడ, సన్నుతాత్మ!

పితరులందర్యముడను నేన్ వినుతకీర్తి!

యమము నే సంయములలోన, నమర చరిత!

భావము.

నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, 

పితరులలో ఆర్యముడిని, సమ్యమవంతులలో నిగ్రహాన్ని.

|| 10-30 ||

శ్లో.  ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం, కాలః కలయతామహమ్|

మృగాణాం చ మృగేన్ద్రోऽహం, వైనతేయశ్చ పక్షిణామ్.

తే.గీ.  దైత్యులందు ప్రహ్లాదుడన్, ధాత్రిపైన

కలయితులలోన కాల మేన్, గరుడపక్షి

నేను పక్షులన్, మృగములన్ నేనె  సింహ

మనుచు నెరుగుము, పార్థుడా! వినుత కీర్తి!

భావము.

నేను దైత్యులలో ప్రహ్లాదుడీని, లెక్కలు కట్టేవాళ్ళల్లొ కాలాన్ని, 

మృగాలలో మృగేంద్రుడిని, పక్షులలో గరుత్మంతుడిని.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.