జైశ్రీరామ్.
|| 11-11 ||
శ్లో. దివ్యమాల్యామ్బరధరం దివ్యగన్ధానులేపనమ్|
సర్వాశ్చర్యమయం దేవమనన్తం విశ్వతోముఖమ్.
తే.గీ. దివ్యమాల్యాంబరములతో దివ్య గంధ
లేపనముతోడవిశ్వవక్త్రోపభాస
మై యలరె విశ్వరూపంబు మహితముగను.
కాంచెనర్జునుడత్తరి ఘనతరముగ.
భావము.
దివ్యములైన పుష్పమాలికలను, దివ్యములైన వస్త్రములను
ధరించి, దివ్య సుగంధ చందనాదుల పూతలతో నిండి,
పరమాశ్చర్యకరమై, మహాకాంతివంతమై, అనంతమై,
విశ్వతోముఖమై భగవానుని అద్భుత విశ్వరూపము విలసిల్లుచుండెను.
|| 11-12 ||
శ్లో. దివి సూర్యసహస్రస్య భవేద్యుగపదుత్థితా|
యది భాః సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మనః.
తే.గీ. వేయిసూర్యులాకాశన వెలుగులీన
నెంత తేజబు కలుగునో యంత తేజ
మీ విష్ణు తేజమునెంచి చూడ
సాటి రాదు, గణింపగ జఖతిలోన.
భావము.
ఆకాశమున ఒక్కసారిగా హఠాత్తుగా సహస్ర సూర్యులు
ప్రకాశించినచో ఎంతటి చూడశక్యముకాని కాంతి కలుగునో
అంతటి అపారకాంతికి ఈ భగవానుని కాంతి సమానమగును.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.